బీజేపీ తో పొత్తు లేనట్లే..జగన్ మాటల్లో అంతర్యం ఏమిటి.?     2018-06-29   04:49:53  IST  Bhanu C

వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఘలక్ ఇచ్చారు..గడిచిన కొన్ని నెలలుగా చంద్రబాబు జగన్ పై చేస్తున్న ప్రధాన ఆరోపణలకి జగన్ చెక్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైసీపి కలుస్తాయని వీరిద్దరికీ తోడుగా జనసేన కూడా కలుస్తుందని ఇన్ని యుక్తులు పన్నేది కేవలం తెలుగుదేశం పార్టీని ఓడించడానికే అంటూ చంద్రబాబు పదేపదే చేస్తున్న ఆరోపణలు ఒక్క సారిగా జగన్ ప్రకటనతో వీగిపోయాయి..2019 ఎన్నికల్లోపు ఏ పార్టీతోనూ పొత్తులుండవని..అసలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా తమకు లేదని జగన్ తేల్చేశారు.

అయితే గతంలో చెప్పినట్టుగా కేంద్రంలో ఎవరు ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉంటారో వారికే తమ మద్దతు ఉంటుంది అంటూ మరో సారి ముక్కుసూటుగా చెప్పేశారు…జగన్ తాజా బీజేపీ తో గానీ జనసేనతోన గాని పొత్తు ఉంటుందని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే..ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకహోదా..వైఎస్ఆర్ పాలన పునరుధ్ధరణ, చంద్రబాబునాయుడు పాలనను తరిమికొట్టట ప్రధాన అజెండాగా జగన్ స్పష్టంగా చెప్పారు.