జగన్ కి “భారీ షాక్” ..పార్టీ ని వీడుతున్న ఆ “ఎంపీ”..?     2018-04-15   03:31:13  IST  Bhanu C

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం , వైసీపిని అధికారంలోకి తీసుకురావడానికి తన తండ్రిలానే పాదయాత్ర చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే పాదయాత్ర మొదలైన సమయం నుంచీ టిడిపి అధినేత చంద్రబాబు యాత్రకి మైలేజ్ రాకుండా వైసీపి ఎమ్మెల్యేలని , కీలక నేతలని సైకిల్ ఎక్కిస్తూ జగన్ మైలేజ్ ని తగ్గించుకుంటూ వచ్చారు అయితే కొంత కాలం తరువాత టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ కి చంద్రబాబు బ్రేక్ ఇచ్చారు

అయితే ఎన్నికలు దెగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుకి మళ్ళీ బ్రేకులు వేయాల్సిన సమయం రావడంతో చంద్రబాబు మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు..అంతేకాదు ఆ ఆపరేషన్ కూడా జగన్ కి ఎంతో బలం ఉన్న నెల్లూరు జిల్లా నుంచే మొదలుపెడుతున్నారట..అంతేకాదు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనేట్టుగా చంద్రబాబు ఈ విషయంలో జగన్ కి ఎంతో దగ్గరి వ్యక్తిపైనే టార్గెట్ పెట్టారు ఇంతకీ ఆయన ఎవరో కాదు జగన్ కి అత్యంత ఆప్తుడు నెల్లూరు జిల్లా వైసీపికి మొదటి నుంచీ పెద్ద దిక్కుగా ఉన్నారు అయితే గతకొంత కాలంగా జగన్ పై తీవ్రమైన అసంతృప్తితో జగన్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది../br>


పార్టీ ని నమ్ముకుని జగన్ కి ఆది నుంచీ ఎంతో అండగా ఉన్న “మేకపాటి” ఇప్పుడు జగన్ వ్యవహార శైలిపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారనున్నారని తెలుస్తోంది అయితే ఇదే అదునుగా చంద్రబాబు మేకపాటిని టిడిపిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయండి అంటూ నెల్లూరు జిల్లా టిడిపి సీనియర్స్ కి బాధ్యతలు అప్పగించారట ఆయన ఎక్కడి నుంచీ పోటీ చేయాలనీ భావించినా సరే పార్టీ అంగీకారం తెలుపుతుంది అనే సిగ్నల్స్ ఇవ్వమని కూడా చెప్పారట చంద్రబాబు..అయితే మేకపాటి ఎందుకు వైసీపిని వీడాలని అనుకుంటున్నారు అంటే..