లోకేష్ ,చంద్రబాబు జైలుకే..జగన్ పక్కా స్కెచ్..    2018-03-25   00:09:53  IST  Bhanu C

ఏపీ రాజకీయాలలో రానున్న రోజుల్లో భారీ మార్పులు సంభవించనున్నాయి నెల రోజుల ముందు వరకు కూడా చంద్రబాబుకి ఢోకా లేదు అనుకున్నారు అందరూ..మళ్ళీ ఎన్నికల్లో ఏపీలో చక్రం తిప్పేది కూడా చంద్రబాబు అని ఫిక్స్ అయ్యారు అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు ఆశలపై నీళ్లు జల్లాయి అని చెప్పవచ్చు .. కేంద్రం తరఫున టీడీపీ రాష్ట్రానికి ఏ మేలు కూడా చేయలేకపోయింది అనే వాదన వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యిందని చెప్పాలి..అయితే ప్రజలకి ఇదే భావన గనుక వైసీపీ చివరి వరకూ కలిపించగలిగితే. జగన్ సీఎం అవ్వడం ఖాయం అని విశ్లేషకులు భావన.

అయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు ని విమర్శించడం మరో పక్క జగన్ ని ఏమి అనకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ జగన్ కి సానుకూలంగా ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పచ్చు ఇదే గనుక జరిగితే జగన్ సీఎం అయితే పవన్ నుండి లోకేష్ అవినీతి ఆధారాలు సేకరించి జైలుకు పంపించే సూచనలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం..

ఇదిలాఉంటే….తెలంగాణాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ. 5 కోట్లు ఒప్పందం చేసుకున్న టిడిపి రేవంత్ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే…దీంతో ఈ వ్యవహారం నడిపింది బాబేనని ఆడియో టేపులను కూడా బయటపెట్టారు…జగన్ సీఎం అవగానే మొదటిసారిగా తిరగతోడే మొదటి కేసు ఇదేనని రాజకీయ పండితులు అభిప్రాయం.. మరి జగన్ నిజంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతాడా లేదా అనేది మాత్రమే ప్రస్తుతానికి ఊహా జనితం..