జ‌గ‌న్ నోట ఎన్టీఆర్ మాట‌.. బాబుకు పెద్ద మైన‌స్‌    2018-04-30   03:48:15  IST  Bhanu C

త‌న నిర్ణ‌యాల‌తో సీఎం చంద్ర‌బాబును ఇర‌కాటంలో ప‌డేస్తున్నారు ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్!! ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎంపీల‌తో రాజీనామా నుంచి ఆయ‌న వేస్తున్న ఒక్కో అడుగు.. టీడీపీ అధినేత‌కు ఇబ్బం దులు క‌లిగిస్తూనే ఉంది. త‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూనే అటు టీడీపీ నేత‌ల‌కు, ఇటు విశ్లేష‌కుల‌కు షాకులు మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని ఎదురుచూస్తున్న వారంతా ఆశ్చ‌ర్యపోయే ప్ర‌క‌ట‌న చేశారు జ‌గ‌న్‌. ఈ ప్ర‌క‌ట‌న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మారుస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదంటు న్నారు విశ్లేష‌కులు. విశ్వ‌విఖ్యాత‌, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు పేరును కృష్ణా జిల్లాకు పెడ‌తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇది జ‌గ‌న్‌కు పాజిటివ్‌నెస్ మ‌రింత పెంచేదే అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్.. సీఎం చంద్ర‌బాబు అవినీతిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతూ ముందుకు వెళుతున్నారు. ఈ పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ప్రాంతాల‌కు అనుగుణంగా హామీలు గుప్పిస్తూ.. అక్క‌డి నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు జ‌గ‌న్‌. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుపై తిరుగులేని రామ‌బాణాన్ని ఎక్కుపెట్టారు వైసీపీ అధినేత‌. ఎన్టీఆర్ సొంత గ్రామ ప్ర‌జ‌ల‌తో పాటు ఎన్టీఆర్ అభిమానులను ఆక‌ట్టుకునే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తెలుగుదేశం పార్టీని, వ్యక్తి గతంగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటిస్తున్న జగన్.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు.