చంద్రబాబు దీక్ష టార్గెట్ గా “జగన్ కుట్ర”     2018-04-19   01:46:33  IST  Bhanu C

ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు నయానో భయానో కేంద్రాన్ని తమ దారిలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నిరసనలని తెలియచేస్తూ కేంద్రం మెడలు వంచే ప్రయత్నం చేస్తుంటే మరో వైపు ఎక్కడ క్రెడిట్ మొత్తం చంద్రబాబు కి వెళ్ళిపోతుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నాడు జగన్ మోహన్ రెడ్డి..మేము మోడీ పై పోరాటం చేస్తున్నాము అని చెప్తూనే వైసీపి వాళ్ళు మరో వైపు మోడీ కాళ్ళు మొక్కుతారు..ఇదేనా మీకు ఉన్న చిత్త శుద్ది అంటూ నిలదీస్తున్నారు టీడీపీ నాయకులు..ఇదిలాఉంటే

మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచీ ఈరోజు వరకూ కూడా మోడీ కి ఎదురుగా నిలబడి ధైర్యంగా దిక్కరించిన వాడు ఒక్కడు కూడా లేడు..అలాంటిది చంద్రబాబు నాయుడు మాత్రమే మోడీ ని ఎదిరించగాలిగారు..ఢిల్లీ వెళ్లి, ప్రెస్ మీట్ పెట్టి, వీడియోలు, డాక్యుమెంట్ లు చూపించి మరీ, వెళ్ళారు..అసెంబ్లీ వేదికగా మోడీని దులిపి దులిపి పెట్టారు. మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని, మోడీ పైనే యుద్ధం చేస్తున్నారు.. ఈ క్రమంలో, తన పుట్టిన రోజు నాడే, దీక్షకు కూర్చుంటున్నారు. దేశ చరిత్రలలో ఏ ఒక్క సీఎం కూడా ఇప్పటి వరకూ తమ రాష్ట్రం కోసం దీక్షకి దిగిన సందర్భం లేదు…