జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోందో తెలుసా     2017-09-29   02:35:48  IST  Bhanu C

Jagan mohan reddy padayatra Root Map

చంద్రబాబు నాయుడు దుష్టపాలన..ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలు..ఓట్లేసి గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించమని భాద్యతలని చంద్రబాబుకు ఇస్తే..బాబు రైతులని..ప్రజలని..డ్వాక్రా మహిళలని ఎలా మోసం చేస్తున్నాడో అందరికి తెలిసేలా..రాష్ట్రము మొత్తం వివరించేలా జగన్ పాదయాత్ర చేపడుతానని ప్రకటించిన విషయం తెలిసినదే ..కానీ కొన్ని కారణాలవలన అది ఆగిపోగా ఇప్పుడు మళ్ళీ ..ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.

ఇప్పుడు చేపట్టబోయే పాదయాత్ర ఎలా ఉండాలి? ఎక్కడ నుంచీ ప్రారంభించాలి అనే విషయాలు తెలిశాయి.ఏ ఏ ప్రాంతాలు కవర్ చేయాలి అనే విషయం మీద చర్చలు జరిగాయి. నవంబరు 2న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ మహాపాదయాత్ర మొదలుకానుంది. దీనికి ఒక రోజు ముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి ఇడుపులపాయకు వెళ్లి..అక్కడ నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు.

జగన్ మహా పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను జగన్ పార్టీ నేతలు వెల్లడించారు. జగన్ ముందుగా కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు,నెల్లూరు,ప్రకాశం, గుంటూరు,కృష్ణ,ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం చివరగా శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ఇచచాపురంతో తన పాదయాత్రను ముగించనున్నారు. జగన్ మహా పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను జగన్ పార్టీ నేతలు వెల్లడించారు. సుదీర్ఘంగా సాగనున్న జగన్ పాదయాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి జగన్ చేసే ఈ పాదయాత్ర సక్సెస్ అవుతుందా అందుకు తగ్గట్టుగా పీకే ఏమి ప్లాన్ చేశాడు..పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చే హామీలపై కసరత్తులు చేస్తున్నారట.