జగన్ నమ్ముకున్న “కమ్మ నేతల సత్తా” ఎంత..?     2018-04-18   05:29:40  IST  Bhanu C

జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని తమవైపుకు ఎలా తిప్పుకోవాలో అని వ్యూహాలు పన్నుతున్నాడు.. అయితే సామాజిక వర్గాల వారీగా చూస్తే..తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటినుంచీ ఇప్పటి వరకూ కూడా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశానికి కొండంత అండగా ఉంటూ వచ్చింది..ఎన్నికల ముందు ఎవరు ఎలా ఉన్నా సరే ఎన్నికల సమయంలో మాత్రం అందరూ ఒక్కటిగా నిలుస్తారు టిడిపి పార్టీ కి అండగా నిలబడుతారు..అయితే ఎన్టీఆర్ దగ్గర నుంచీ చంద్రబాబు వరకూ కూడా పార్టీ నిర్మాణంలో కానీ , పదవులని పంచడంలో కాని అన్ని కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాలకి కూడా న్యాయం చేసేవారు..తమ కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నడూ .అనుకోలేదు

అయితే వైఎస్ తన హయాంలో రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు అంతేకాదు బీసీ కులస్తులని పెద్దగా పట్టించుకునే వారు కాదు కూడా..అదే విధంగా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సైతం ఎక్కవగా రెడ్డి కులస్తులకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు గత ఎన్నికల్లో కమ్మ సామజిక వర్గం ఎక్కువగా ఉన్న గుంటూరు ,కృష్ణా జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చే విషయంలో సైతం కమ్మ వర్గాన్ని పక్కకి పెట్టేశాడు..కేవలం ఒక్కటంటే ఒక్క సీటు అది కూడా గుడివాడ నాని కి తప్ప మరో కమ్మ వ్యక్తికీ సీటు ఇవ్వలేదు దాంతో గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు జగన్ కి భారీ ఘలక్ ఇచ్చారు..