అనుమానాస్పద స్థితిలో భారతీయుడు మృతి  

ఎన్నో ఆశలతో విదేశాలు వెళ్లి అక్కడ డబ్బు సంపాదించి..తమ కుటుంభాన్ని భార్య పిల్లలని ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలపాలని వెళ్ళే ఎంతో మంది యువకులు , స్త్రీలు..ఆనేక కారణాల వలన అసువులు బాస్తున్నారు..చాలా మంది అక్కడ అనుకున్న సంపాదన లేకపోవడం వలనగానీ బ్రతుకు బండి నడపలేక కుటుంభానికి దూరంగా ఉండలేక మనో వేదనతో చనిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే

తాజాగా భారత్ కి చెందిన ఒక వ్యక్తి యూఏఈలోని అబుదాబి నగరంలో మృతిచెందాడు. కేరళకు చెందిన జబర్ కేపీ వారం రోజుల క్రితం కనిపించకుండాపోయాడు..అయితే అతని సన్నిహితులు ఎన్నో రకాలుగా అతడి కోసం ప్రయత్నాలు చేసినా ఎక్కడా కనిపించలేదు..అయితే జబర్ కోసం వెతుకుతుండగానే ముస్సఫాహ్ ఇండస్ట్రీయల్ ఏరియా శివార్లలో జబర్ మృతదేహం కనిపించింది.

అయితే మృతి చెందిన వ్యక్తి ఎవరో తెలియకపోవడంతో అక్కడి సామాజిక సేవా కార్యకర్తలు..సామాజిక సేవా కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మృతుడి సోదరుడు గుర్తించి ఘటనాస్థలానికి వెళ్లాడు. అన్నయ్య మృతదేహాన్ని గుర్తుపట్టాడు. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయాడని తమ్ముడు తెలిపాడు. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన తామిద్దరం అబుదాబిలోని ఒకే బ్యాంకులో పనిచేస్తున్నామని వెల్లడించాడు.అయితే మృతుడు ఎందుకు చనిపోయాడో తెలుసుకునేందుకు పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కి మృతదేహాన్ని పంపారు.