25వ సినిమాకు మరీ ఇంత చీప్‌ బిజినెస్సా.. అయ్యో పాపం     2018-07-05   00:04:45  IST  Raghu V

గోపీచంద్‌ హీరోగా పరిచయం అయ్యి సక్సెస్‌ కాలేక పోయాడు. ఆ తర్వాత విలన్‌గా తన సత్తా చాటి మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా ఇప్పటి వరకు 24 చిత్రాలు చేసిన గోపీచంద్‌ తాజాగా 25వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఏ హీరోకు అయినా 25వ చిత్రం అంటే చాలా ప్రతిష్టాత్మకం. ఈ తరం హీరోల్లో 25 చిత్రాలు చేసే హీరోలు అంటే చాలా గొప్ప. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ ప్రకారం పది పదిహేను చిత్రాలు చేసి ఫేడ్‌ ఔట్‌ అవుతున్నారు. లేదంటే 25 చిత్రాలు చేసేందుకు చాలా సమయం పడుతుంది. అయితే గోపీచంద్‌ తక్కువ సమయంలోనే తన 25వ చిత్రంకు చేరుకున్నాడు.

25వ చిత్రంగా గోపీచంద్‌ ‘పంతం’ చిత్రాన్ని చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన పంతం చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ చిత్రం ప్రస్తుతం భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు జరుపుకుంటుంది. 25వ చిత్రం అవ్వడంతో నిర్మాతలు కూడా ఈ చిత్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం గోపీచంద్‌ 25వ చిత్రంను పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.