మోదీకి తగ్గుతున్న "క్రేజ్"...ఆ "సర్వేల్లో" తేలింది ఇదే.  

దళితులు, మైనార్టీలు మరోసారి నరేంద్ర మోడీకి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా లేరని సర్వే స్పష్టం చేసింది. అదే విధంగా దేశంలో ఉన్నత కులాలకు చెందిన వారు, ఓబిసీ వర్గాలు నరేంద్ర మోడీకి మరోసారి అధికారం అప్పజెప్పేందుకు సుముఖంగా ఉన్నాయి. మరోవైపు సీట్ల విషయంలో ఎన్డీయే కూటమి యూపీఏ కూటమి కంటే ముందంజలో ఉంది. ఎన్డీయే కూటమికి 274 సీట్లు వచ్చే అవకాశం ఉండగా, యూపీఏ కూటమికి 164 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది.19 రాష్ట్రాల్లో ఏప్రిల్ 20 నుంచి మే 17 వరకు దాదాపు 15 వేల మంది అభిప్రాయాలను సేకరించింది.

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినట్లు స్పష్టమయింది. ఉత్తరాదిలో ఎన్డీయే కూటమికి 90 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటే, దక్షిణాదిలో 18 నుంచి 22 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. క్షిణాదిలో మొత్తం 67 నుంచి 75 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉత్తరాదిలో మాత్రం యూపీఏ కూటమి కేవలం 25 స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది సర్వే లో తేలింది. మొత్తానికి మెజార్టీ ప్రజలు నరేంద్ర మోదీని అంటే పెద్దగా ఇష్టపడడంలేదన్నట్టు సర్వేల్లో తేలుతోంది.