మోదీకి తగ్గుతున్న "క్రేజ్"...ఆ "సర్వేల్లో" తేలింది ఇదే.     2018-05-26   01:56:39  IST  Bhanu C

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండనుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. కొన్ని సంస్థలు . దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి గడ్డు కాలం మొదలయిందనే సంకేతాలు ఈ సర్వే ఇచ్చింది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని, బిజెపిని ప్రజలు తిరస్కరించనున్నట్లు సర్వే పేర్కొంది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్…సీఎస‌డీఎస్, ఏబిపి న్యూస్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి..

ఎన్డీయే కూటమికి 274 సీట్లు, యూపీఏ కూటమికి 164 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ప్రజాకర్షణ విషయంలో మోడీ గ్రాఫ్ పడిపోతున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతోంది. నరేంద్ర మోడీ కి ప్రజల్లో ప్రస్తుతం ఆదరణ ఎలా ఉంది? కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ప్రజాకర్షణ ఎంత శాతం పెరిగింది ? తదితర అంశాలపై సంస్థ సర్వే చేపట్టింది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని, బిజెపిని ప్రజలు తిరస్కరించనున్నట్లు సర్వే పేర్కొంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ కి బీజీపీ కన్నా 5 శాతం అధికంగా ఓట్లు పొలయ్యే అవకాశం ఉందని, అదే విధంగా మధ్య ప్రదేశ్ లో బిజెపి కంటే కాంగ్రెస్ కు 15 శాతం ఓట్లు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తేలింది.