టీడీపీలో ఘంటా- తంటాలు ! ఉండాలా వద్దా ..?     2018-06-21   00:27:06  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీలో అలుముకున్న అసంతృప్తుల పర్వం ముదిరి పాకనపడింది. ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని అధినేతకు తెలిసేలా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కీలకంగా ఉన్న మంత్రి ఘంటా శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు టీడీపీ లో హాట్ టాపిక్ గా మారింది. చాలాకాలంగా టీడీపీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్న మంత్రి గంటా .. పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. తాజాగా విశాఖలో ఈ రోజు జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనపై ఘంటా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

సిఎం చంద్రబాబు ఈ రోజు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో గంటా హాజరువుతారా లేదా అన్న ఆసక్తి అందరిలోనూ .. నెలకొంది. విశాఖపట్నంలోనే గంటా ఉండి కూడా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పట్టించుకోవడంలేదు. ప్రొటోకాల్ వ్యవహారాలు కూడా చూడడంలేదు. మీడియా వెళ్లి సీఎం టూరు గురించి ఆయనను అడిగితే.. చంద్రబాబు వస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.