జనసేన ఉంటుందా? ఊడిపోతుందా?..త్వరలో తేలిపోనుంది..     2018-04-17   01:01:31  IST  Bhanu C

ఏపీలో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుంది..? రానున్న ఎన్నికల్లో జనసేన కి వచ్చే సీట్లు ఎన్ని..? అసలు జనసేన ప్రభావం సీనియర్ పార్టీలపై ఉంటుందా..? అసలు జనసేన కి ఎంతవరకూ సత్తా ఉంది ఈ విషయాలపై తాజా ఘటనకి సంభందించి విశ్లేషకులు కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించారు…మరి విశ్లేషకులు ఏమి చెప్పారు..జనసేన ఉంటుందా ఊదిపోతుందా..? అసలు 2019 ఎన్నికలవరకూ అక్కర్లేదు ఈలోగానే జనసేన సత్తా తేలిపోతుంది అంటున్నారు విశ్లేషకులు..వివరాలలోకి వెళ్తే..

రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది..స్థానిక సంస్థల పోరులో తామేంటో నిరూపించుకుటాము అని తెలిపింది..అందుకు గాను జనసేన పార్టీ కార్యకర్త సిద్దంగా ఉండాలని..ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే జనసేన సత్తా చూపించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన నాయకులు, కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన జనసేన నేత బొమ్మదేవర పద్మనాభ శ్రీధర్‌ తెలిపారు

పవన్‌ కళ్యాణ్‌ ఒక సినిమా చేస్తేనే కోట్లాది రూపాయలు వస్తాయని అయినా అవన్నీ వదులుకుని రాజకీయ ప్రవేశం చేస్తోంది కేవలం ప్రజా సేవకోసమేనని అన్నారు..పార్టీ ఎవరికీ సీట్లు ఇస్తుంది అనేది పూర్తిగా పార్టీ అభిప్రాయం అని అయితే కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం త్వరలో రాష్ట్రంలో పర్యటనలు ఉంటాయని అన్నారు..ఈ పర్యటనల అనతంరం మండల, గ్రామ కమిటీల నియామకం జరుగుతుందని స్పష్టం చేశారు…జనసేన సభ్యుత్వం తీసుకున్నవారిలో 60 శాతం యువత ఉందని వెల్లడించారు.