మధుమేహం ఉన్నవారు మామిడిపండు తింటే ఏమవుతుందో తెలుసా?     2018-04-27   23:15:07  IST  Lakshmi P

వేసవికాలం మొదలు అయ్యిపోయింది. ఇక మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి పండు తినటం వలన మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. మామిడి పండ్లను అందరు తినవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు మామిడి పండు తినటానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. మామిడి పండు తింటే రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయని భావిస్తారు. దాంతో మామిడిపండుకి దూరంగా ఉంటారు. అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండును తినవచ్చా? తింటే ఏమి అవుతుందో తెలుసా? ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

సాధారణంగా మీడియం సైజ్ మామిడి పండు నుంచి లభించే కేలరీలు ఒక‌టిన్న‌ర గోధుమ రొట్టెలో ఉన్న కేలరీలతో సమానం. కాబట్టి మధుమేహం ఉన్నవారు మామిడిపండును తినవచ్చు. అయితే భోజనం చేసిన వెంటనే మాత్రం మధుమేహం ఉన్నవారు మామిడిపండుకు తినకూడదు. ఎందుకంటే భోజనం చేసినప్పుడు మన శరీరంలోకి అవసరమైన కేలరీలు చేరతాయి. భోజనం అయ్యాక మామిడిపండు తింటే కేలరీలు ఎక్కువై కొవ్వుగా మారే అవకాశం మరియు రక్తంలో చక్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నాయి.