వర్మ తీసే ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్ర చేసేది ఎవరు అంటే?     2017-10-11   03:59:10  IST  Raghu V

Is he the one playing NTR in RGV’s “Lakshmi’s NTR

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఒకటి కాదు రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకదాన్ని నందమూరి బాలకృష్ణ నిర్మించబోతుండగా, తానూ కూడా సినిమా తీస్తానని హల్ చల్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే బాలకృష్ణ మాదిరి ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా తెర మీదకి ఎక్కించే ప్రయత్నం చేయడం లేదు వర్మ. అలా చేస్తే ఆయన రామ్ గోపాల్ వర్మ ఎందుకు అవుతారు? తనదైన స్టయిల్లో “Lakshmi’s NTR” అంటూ సంచలనాత్మక టైటిల్ కూడా పెట్టేసారు.

ఎన్టీఆర్ రెండోవ భార్య లక్ష్మిపార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్ అయ్యాకా ఏం జరిగిందో మాత్రమే తానూ చూపించాలనుకుంటునానాన్ని, ఎన్టీఆర్ జీవితంలోకి మిగితా దశల గురించి తన సినిమాలో పెద్దగా ప్రస్తావించనని ఆర్జీవి స్పష్టం చేసారు. దాంతో వాడివేడిగా ఉంది వాతావరణం. ఆర్జీవి – లక్ష్మిపార్వతి మధ్య ఇంకెన్ని గొడవలు జరుగుతాయో. ఇంతకి ఈ వివాదాస్పదమైన ప్రాజెక్టులో ఎన్టీఆర్ పాత్ర పోషించేది ఎవరు? ఆర్జీవి ఇంకా పేరు బయటకి చెప్పడం లేదు గాని, ప్రకాష్ రాజ్ వర్మ ఆలోచనల్లో ఉన్నారట. కాని ఆ పాత్రను పోషించే సాహసం పేరున్న ఆర్టిస్టు ప్రకాష్ రాజ్ చేస్తారా?

ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలవుతుంది. వచ్చే ఏడాదే అక్టోబర్ లో విడుదల చేస్తారట. ఇక బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ జీవితచరిత్రలో నటీనటుల గురించి ఇంకా వివరాలు బయటకి రాలేదు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించవచ్చు.