మధుమేహం ఉన్నవారు నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా?     2018-05-15   21:55:41  IST  Lakshmi P

మధుమేహం ఉన్నవారు నెయ్యి తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం మధుమేహం ఉన్నవారు కూడా నెయ్యి తినవచ్చు. అయితే మోతాదు మించకూడదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇంటిలో తయారుచేసిన నెయ్యి అయితే చాలా మంచిది. ఒకవేళ ఇంటిలో తయారుచేసిన నెయ్యి లేకపోతే ఆర్గానిక్ నెయ్యిని మార్కెట్ లో కొనుగోలు చేయాలి. ఇప్పుడు నెయ్యి తింటే మధుమేహం వారికి ఎన్ని లాభాలు చేకూరతాయో తెలుసుకుందాం.

అన్నం,బ్రేడ్ వంటివి తిన్నప్పుడు వాటిలో ఉండే పిండిపదార్ధం కారణముగా రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. ఆలా కాకుండా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

శరీరంలో ఉండే చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.