సాఫ్ట్ వెర్ భార్య తో IPS ఆఫీసర్ అక్రమ సంబధం అడ్డంగా దొరికారు  

అన్యాయంపై ఉక్కు పాదం మోపాల్సిన ఐపీఎస్ బాస్ అడ్డదారి తొక్కాడు..అక్రమ సంభందాలు తప్పు అని చెప్పవలసిన ఆ అధికారి ఓ పెళ్లి అయిన మహిళతో అక్రమ సంభంధం నెరిపాడు..ఇది తప్పు అని వారించిన ఆ మహిళ భర్తని చంపేస్తా అని బెదిరించాడు ఈ వార్త ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి తలనెప్పి తీసుకు వచ్చింది..ప్రజల కోసం పనిచేయవలసిన వారు ప్రజలనే హింసిస్తుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి అంటూ మానవతా వాదులు నిప్పులు చెరుగుతున్నారు ఈ ఘటన వివరాలోకి వెళ్తే..

కర్ణాటక రాష్ట్రంలోని దేవాంగెరె ప్రాంతానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ అయిన యువకుడు 2010లో ఓ యువతిని వివాహం చేసుకొని ఆమెను అమెరికాకు తీసుకువెళ్లాడు..అయితే అక్కడ రెండేళ్ళు ఉన్న తరువాత తిరిగి మళ్ళీ సొంత రాష్ట్రానికి వచ్చేసి దేవాంగెరె పట్టణంలో తన భార్య గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియో పెట్టించాడు ఈ క్రమంలో తన స్టూడియోకి ఒక ఐపీఎస్ అధికారి వచ్చి తనభార్యతో అక్రమ సంభంధం పెట్టుకున్నాడని ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు..

అయితే మొదట్లో నా భార్యని మండలిచాను కానీ క్రమ క్రమంగా వారి ప్రేమ కలాపాలు కొనసాగించడం మళ్ళీ మొదలు పెట్టారని ఫిర్యాదులో తెలిపాడు.. తన భార్యను ఐపీఎస్ అధికారి ముద్దు పెట్టుకుంటున్న వీడియో భార్య ఫోన్ లో కనిపించిందని బాధిత భర్త పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ఫిర్యాదు చేస్తే ఎన్‌కౌంటర్ చేస్తానని ఐపీఎస్ అధికారి తనను బెదిరించాడని బాధిత భర్త పోలీసులతోపాటు డీజీపీకి ఫిర్యాదు చేశారు…అయితే ఈ కేసులో భర్తపై భార్య రివర్స్ గా కేసు పెడుతానని హెచ్చరిస్తోందట..అయితే ఐపీఎస్ అధికారి కావడంతో కేసుని అధికారులు నీరు గారుస్తారేమో నని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఆమె భర్త.