భారత సంతతి శాస్త్రవేత్తకి ...అమెరికా భారీ 'సాయం'     2018-09-13   18:38:05  IST  Bhanu C

భారతీయుల ప్రతిభకి మరో సారి తగిన గుర్తింపు దక్కింది అమెరికాలో..అమెరికాలో భారతీయులు మరో మారు సగర్వంగా తలెత్తుకుని ఇది భారతీయుల సత్తా అని చాటి చెప్పుకునే విధంగా భారత సంతతి వ్యక్తి చేసిన పరిశోధన అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది..ఇండియన్స్ యొక్క తెలివితేటలకి ఇది ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు..ఇంతకీ ఆ భారతీయ అమెరికన్ సాధించిన ఘనత ఏమిటి..? అమెరికా చేసిన సాయం ఏమిటి అంటే..

Arul Chinnaiyan Awarded USD 6.5 Millions,Identify Cancer Biomarkers,Indo-American Professor Arul Chinnaiyan Awarded USD 6.5 Millions

ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికా వచ్చి స్థిరపడిపోయిన అరుల్ చిన్నయ్యన్ అక్కడ గొప్ప పరిశోధకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.. మిషిగన్‌ వర్సిటీలో అధ్యాపకుడిగా అరుల్‌ పనిచేస్తున్నారు. మనిషి లో దాగిఉన్న ఎన్నో సమస్యలకి ముఖ్యంగా క్యాన్సర్ వంటి కీలక జబ్బులకి సంభందించి ఎన్నో పరిశోధనలు చేశారు..అంతేకాదు ఈ పరిశోధనలలో అమెరికా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది అయితే

Arul Chinnaiyan Awarded USD 6.5 Millions,Identify Cancer Biomarkers,Indo-American Professor Arul Chinnaiyan Awarded USD 6.5 Millions

కీలక క్యాన్సర్‌ నిర్ధారణ “బయోమార్కర్లు” గుర్తించిన అరుల్‌ చిన్నయ్యన్‌కు రూ.47.25 కోట్ల నగదు ప్రోత్సాహకం దక్కింది. వ్యాధి నిర్థారణ , కొత్త చికిత్సా విధానాల అభివృద్ధిలో ఈ బయోమార్కర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది. దీంతో అమెరికా జాతీయ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (యూఎస్‌ఎన్‌సీఐ) ఈ ప్రోత్సాహకాన్ని అందించింది. అయితే యూఎస్‌ఎన్‌సీఐ ఈ మొత్తాన్నీ త్వరలోనే అందించనుంది అని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.