Indian girls speak out on “Love at first site”

మన తెలుగు సినిమాల్లో చూస్తుంటాం … హీరో ఇంట్రోడక్షన్ ఇలా పూర్తవుతుందో లేదో అలా హీరోయిన్ కనబడుతుంది. పూల పడతాయి, స్లో మోషన్ లో హీరోయిన్ ముఖాన్ని ఇలా చూడగానే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ … ఖతం హీరో ప్రేమలో పడిపోతాడు. అప్పటికప్పుడు ఓ ట్యూన్ కి లిరిక్స్ కట్టి పాట పాడేసుకుంటాడు. ఇక ఈ జన్మ నీదే అంటాడు, నువ్వు లేకుండా ఉండలేను అంటాడు. అంతా ఒక్క చూపులోనే. ఒక్క చూపులోనే తన జీవిత భాగస్వామి ఈమె అని ఎలా డిసైడ్ చేసుకుంటాడు ? అది నిజంగా సాధ్యపడే విషయమా ? అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో ప్రేమలో ఎలా పడతారు? దీనిపై అమ్మాయిల అభిప్రాయం ఏమిటో చూసేందుకు ఒక ఇండియన్ లైఫ్ స్టయిల్ ఛానెల్ వీధుల్లోకి వెళ్లి అమ్మాయిలను అడిగింది. అందులో కొన్ని స్పందనలు చూడండి.

అమ్మాయి 1 :

“నేనైతే అస్సలు నమ్మను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకు నమ్మకం లేనే లేదు. ఒక్క చూపులో ప్రేమ ఎలా పుడుతుందో, దాన్ని సినిమావాళ్ళు ఎలా చూపిస్తారో తెలియదు. రోడ్డు మీద ఎంతోమంది అందమైన అబ్బాయిలు ఉంటారు. కంటికి అందరు నచ్చుతారు. నిజం చెప్పాలంటే బాగున్న అబ్బాయిల వైపే చూస్తాను. కాని ఒక వ్యక్తి మనస్తత్వం నచ్చితే అతడు ఎలా ఉన్నాడు అనేది తరువాతి విషయం. కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనేది వెస్ట్.

అమ్మాయి 2 :

సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎలా నచ్చుతారో ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కూడా అంతే. పడిపోవడం వేరు, ప్రేమలో పడిపోవడం వేరు. నచ్చడం వేరు, ప్రేమించడం వేరు. అమ్మ నాన్నల తరువాతి ఒక వ్యక్తి అలాంటి స్థానం ఇస్తున్నామంటే అతడిని వ్యక్తిగా ప్రేమించగలగాలి. శరీరాన్ని కాదు.