ముందస్తు .. ఉండొచ్చు ! సిద్ధమవుతోన్న పార్టీలు !     2018-06-13   03:09:50  IST  Bhanu C

ముందస్తు ఎన్నికలకు సంబంధించి తనతో సన్నిహితంగా ఉండే పార్టీలకు బీజేపీ లీకులించిందనే వార్త కూడా ఇప్పుడు రాజకీయవర్గాల్లో తిరుగుతోంది. ఇప్పటికే ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో.. ఈ మేరకు.. చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు. పరిస్థితులు మారుతూండటంతో వేగంగా వ్యూహాలను మార్చేస్తున్నారు నాయకులు. ఇప్పుడు చంద్రబాబు ఆరు నెలల కార్యాచరణను ప్రకటించారు. ఆరు నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. పదమూడు జిల్లాల్లో యూనివర్శిటీల విద్యార్థులతో పాటు సేవా మిత్రలు, సాధికార మిత్రలతో సమావేశమవుతానంటున్నారు.

ఇక ఏపీలో బీజేపీ నేతలు కూడా టీడీపీ మీద దాడి ముమ్మరం చేయడంతోపాటు.. రాజకీయంగా మైలేజ్ పెంచుకునే పనిలో పడ్డారు. ఇక వైసీపీ… జనసేన పార్టీలు జనాల్లో తిరుగుతూ మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యే ఉన్నాయి. అంటే ముందస్తు ఎన్నికలు వస్తే మేం రెడీ అని ప్రతి పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.