అమెరికాలో భారతీయుడికి యావజ్జీవ శిక్ష..?     2018-08-19   17:25:03  IST  Bhanu C

ఏడూ నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో డెట్రాయిట్‌ వెళ్లే స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో వెళ్తున్న భారతీయ ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగి తన సీటు పక్కనే ఉన్న తోటి ప్రయాణీకురాలితో…అసభ్యంగా ప్రవరిస్తూ లైంఘిక దాడికి పాల్పడ్డాడు…దాంతో ఆ ప్రయాణికురాలు సిబ్బందికి చెప్పడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..అయితే చాలా కాలం తరువాత జరిగిన ఈ కేసుకు సంభందించిన విచారణ జరిగింది.

Indian Convicted,life In Jail

సదరు వ్యక్తి ఆ భాదిత యువతి చెప్తూ “నిద్ర పోతున్న నాకు శరీరం మీద ఏదో పాకుతున్నట్లు అనిపించింది. లేచి చూసేసరికి రమణమూర్తి నా ప్రైవేట్‌ శరీర భాగాలను తడుముతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాను” అని తెలిపింది. ఈ వ్యవహారంపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు.

అయితే ఈ కేసు విచారణలో మొదట రమణమూర్తి తన నేరాన్ని అంగీకరించలేదు నాకు ఏమి తెలియదు అంటూ బుకాయించాడు అయితే పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారణ చేసేసరికి తన నేరాన్ని అంగీకరించాడు.. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఇటీవల అతడిని దోషిగా తేల్చింది…డిసెంబరు 12న రమణమూర్తి కి యావజ్జీవం విధించే అవకాశం ఉందని సమాచారం..