అ హీరోతో పిల్లల్ని కన్నట్టు ఊహించుకునే దీపిక  

నీళ్ళు ఏ పాత్రలో ఉంటే ఆ ఆకారంలోకి మారిపోతాయి. హీరోయిన్లు కూడా అంతే. ఏ ఇండస్ట్రీలో పనిచేస్తే ఆ ఇండస్ట్రీకి తగ్గట్టుగా మారిపోతారు. ఆహార్యం మాటతీరు అంతా మారిపోతాయి. ప్రియాంక చోప్రా, దీపిక పడుకొనేని ఉదాహరణగా తీసుకోండి, హాలివుడ్ వెళ్ళాక వారి మాటతీరులో కాని, డ్రెస్సింగ్ సెన్స్ లో కాని ఎలాంటి మార్పులు వచ్చయో. కేవలం వస్త్రధారణే కాదు, మాటతీరు కూడా బోల్డ్ గా తయారయ్యింది.

దీపిక నటించిన తోలి హాలివుడ్ చిత్రం “XXX-The Return of Xander Cage” భారతదేశంలో మొన్న 13వ తేదినా విడుదల కాగా, ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుంది. ఈ సినిమా కోసం అమెరికాలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న దీపిక, ఇటివలే ఒక టాక్ షోలో సంచలనమైన వ్యాఖ్య చేసింది. ఆ సినిమా హీరో విన్ డిజిల్ తో తన కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ తనతో కలిసి జీవిస్తున్నట్లు, పిల్లల్ని కూడా కన్నట్లు ఊహించుకుంటానని చెప్పింది.

“పొగ లేనిదే నిప్పు ఉండదు. కాని అంతా నేను ఊహించుకునేదే. నా ఊహలో తనతో కలిసి ఉంటున్నట్లుగా, ఈ కెమిస్ట్రీ ఉన్నట్లుగా, మేం పిల్లల్ని కన్నట్లుగా అనిపిస్తుంది” అంటూ బిడియంగా, సరదాగా చ్చేప్పింది దీపిక. మనం వినడానికి ఈ స్టేట్మెంట్ బాగానే ఉంది కాని పాపం దీపిక బాయ్ ఫ్రెండ్ రన్వీర్ సింగ్ పరిస్థితి ఏంటో !