పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఇవి ..జాగ్రత్త

స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలానో, పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ అలాగా. ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలు తీసుకుంటోంది ప్రోస్టేట్ గ్రంధి క్యాన్సర్. బాధాకరమైన విషయం ఏమిటంటే, దీనిపై చాలామందికి సరైన పరిజ్ఞానం లేకపోవడం. అందుకే సమస్యను మొదట్లోనే తుంచాలంటే దాని లక్షణాల మీద అవగాహన ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటో చూడండి.

* మూత్రం సరిగా రాదు. అంటే, ఆగి ఆగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మూత్ర విసర్జన ఓ ఫ్లో ఉండదు. కొందరికి చుక్కలు చుక్కలుగా రావొచ్చు. ఇలా జరుగుతోంది అంటే ప్రోస్టేట్ గ్రంధిలో ఎదో ఒక సమస్య ఉందని అనుమానపడాల్సిందే.

* కొందరికి మూత్రంలో రక్తం బయటకి వస్తుంది. ఇలా జరిగితే ఎలాగో అజాగ్రత్త పడరు అనుకోండి. కాని మొహమాటంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదు. ఇది దాదాపుగా ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించిన సమస్యే. ఎలాంటి ఆలస్యం చేయడకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

* రక్తంలో మార్పులు కనిపిస్తూనే మోకాళ్ళలో నొప్పులు ఉంటాయి. ఎముకలు అరిగిపోయినట్లుగా నొప్పులు ఉండొచ్చు. దీనర్థం ప్రోస్టేట్ గ్రంధి నుంచి క్యాన్సర్ ఎముకలా దాకా వ్యాపించడం వలన ఇలా జరుగుతుంది.

* పురుషులకి తెల్సిన విషయమే ఇది. అప్పుడప్పుడు మూత్ర విసర్జన రెండు మార్గాల్లో, విడిపోయినట్లుగా వస్తూ ఉంటుంది. ఇలా తరచుగా జరిగితే అది కూడా ఓ ప్రమాద ఘంటికే అన్న విషయం గుర్తుపెట్టుకోండి.