రథసప్తమి రోజు 7జిల్లేడుఆకులతో ఇలాచేస్తే 7 జన్మల పాపాలు పోతాయి Devotional Bhakthi Songs Programs     2018-01-18   20:59:48  IST  Raghu V

Importance of Ratha Saptami

హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. సూర్య భవవానుడు కస్యపుమహాముని కుమారుడు. సూర్య భగవానుని జన్మ తిథి అయినా మాఘ సుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందుతాం.సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేని వారు మాఘమాసం లో ఒక ఆదివారం పూజించినా కూడా మంచి ఫలితం వస్తుందని మన పెద్దలు అంటారు.

రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే స్నానము చేసి, సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు సూర్య భగవానుని ఎదుట ముగ్గు వేసి ,ఆవుపిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పోంగలిని ఉంచి సూర్య భగవానునికి నైవేద్యం పెట్టాలి. ప్రతి మాసంలోను సప్తమి తిధి వస్తుంది. అయితే మాఘ మాసంలో వచ్చే సప్తమి బాగా విశిష్టమైనది. మన వేదాలలో సూర్య భగవానుడు ఏడు గుర్రాల బంగారు రధంపై గమనం ఉంటుందని చెప్పబడింది.