శ్రీనువైట్ల.. నీకు ఇంకా బుద్ది రాలేదా?     2018-05-21   22:28:27  IST  Raghu V

వరుసగా నాలుగు భారీ డిజాస్టర్‌లు చవిచూసిన తర్వాత ఏ దర్శకుడికి కూడా హీరోు ఛాన్స్‌ ఇవ్వరు. ఇటీవల కాలంలో ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్‌ అయితే ఆ దర్శకుడు కనిపించకుండా పోవాల్సిందే. కాని శ్రీనువైట్ల ఏకంగా నాలుగు అట్టర్‌ ఫ్లాప్‌లు అయినా కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఈయనపై అభిమానం మరియు గౌరవంతో రవితేజ ఈయన దర్శకత్వంలో నటించేందుకు ముందుకు వచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ తెరకెక్కుతుంది. ఈ చిత్రంపై ఏ ఒక్కరికి అంచనాలు లేవు. కనీసం రవితేజకు కూడా ఈ సినిమా ఆడుతుందనే నమ్మకం లేనట్లుంది. కేవలం శ్రీనువైట్ల కోసం ఈ సినిమాను చేస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు శ్రీనువైట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతి పాత్రకు సరైన నటీనటులను ఎంపిక చేయడంలో దర్శకుడు ప్రతిభ కనిపిస్తుంది. సినిమా సక్సెస్‌కు మొదటి పాయింట్‌ పాత్రలకు సరైన నటీనటులను ఎంపిక చేయడం అంటారు. తాను రాసుకున్న పాత్రలకు సరైన నటీనటులను ఎంపిక చేయడంతో పాటు, ఆ నటీనటుల వల్ల సినిమాకు కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయాలను కూడా గుర్తించాల్సి ఉంటుంది. కాని శ్రీనువైట్ల మాత్రం అలా ఆలోచించడం లేదని, ఆయన అనాలోచిత నిర్ణయంతో సినిమాను మంట కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.