If Prabhas can collect 1000cr, Pawan should collect 3000cr – RGV

అసలు ఎందుకు మొదలైందో, ఎక్కడ మొదలైందో ఈ శతృత్వం, పవన్ కళ్యాణ్ తుమ్మినా దగ్గినా సెటైర్ వేసేలా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి మొదలు, కాదు కాదు జనసేన ఆవిర్భావం నుంచి మొదలు పవన్ కళ్యాణ్ మీద, మెగాఫ్యామిలి మీద వివాదస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఆర్జీవి.

మొన్నటి రాత్రి షోలతో బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ మార్కుని దాటింది. భారతీయ సినిమా మొదలైనప్పటినుంచి ఒక ఇండియన్ మూవీ వేయి కోట్లు సాధించడం ఇదే మొదటిసారి. హిందీ సినిమా చేయలేని పనిని ఒక తెలుగు సినిమా చేసి చూపెట్టింది. ఈ సందర్భంగా ఇటు పవన్ కళ్యాణ్, అటు మహేష్ బాబు, ఇద్దరు బాహుబలి 1000 కోట్ల మార్కు అందుకోవడంపై తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసారు. మహేష్ ట్వీట్ మీద ఎలాంటి కామెంట్ చేయని వర్మ, ఎప్పటిలాగే పవన్ ట్వీట్ మీద మాత్రం సెటైర్ వేసారు.

ప్రభాస్ 1000 కోట్ల కలెక్షన్ తెప్పించగలిగితే, మరి పవన్ కళ్యాణ్ 3000 కోట్లు వసూలు చేయాల్సిందే అంటూ రిప్లై పెట్టారు. ఇది సెటైర్ అని మనకు తెలియదా! లేదంటే బాహుబలికి, మామూలు సినిమాలకి పోలిక ఏంటి ! వర్మకి అంతా తెలుసు, కాని కావాలనే గిల్లుతుంటారు. వర్మ కామెంట్ కి ఎప్పటిలాగే సమాధానం ఇవ్వలేదు పవర్ స్టార్. ఆ తరువాత ఏమైందో, వర్మ ఆ 3000 కోట్ల ట్వీట్ ని డిలీట్ చేసేసారు.