హైపర్ ఆది ఎవరి కొడుకో తెలుసా.? బయటపడ్డ షాకింగ్ నిజం..! ఎవరో తెలుస్తే..?     2018-05-28   00:10:28  IST  Raghu V

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.

జబర్ధస్త్ నుంచి సినిమాల వరకు సాగిన ఆది ప్రయాణంలో ఒడిదుడుకులు ఎన్నో ఉన్నాయి. జబర్ధస్త్ లోకి రావడానికి ఆది అష్టకష్టాలు పడ్డాడు. ఓ మారుమూల పల్లెనుంచి హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చిన ఆది విజయాల వెనుక కళ్లు చెమర్చే కథ ఉంది. హైపర్ ఆది పుట్టింది పెరిగింది ప్రకాషం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామం. తల్లిదండ్రులు కోటనరసింహం, శారదలు.. వీరిది రైతుకుటుంబం.. 8వ తరగతి వరకు పల్లామల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. 9,10 తరగతులు మద్దిపాడు నాగార్జున స్కూలులో.. ఇంటర్ పేర్నమిట్ట శ్రీచైతన్యలో విధ్యనభ్యసించాడు. బీటెక్ ప్రకాషం ఇంజినీరింగ్ కాలేజీలో పూర్తి చేశాడు..