మరో 5 నిమిషాల్లో పెళ్లి అనగా...ప్రేమికులను విడదీశారు..! సినీఫక్కీలో ఏమైంది అంటే.?     2018-06-21   00:18:59  IST  Raghu V

మరో ఐదు నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతున్నామన్న యువ జంట ఆశలు ఆవిరయ్యాయి. పెద్దలను కాదని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోబోతున్న జంటను అమ్మాయి తరఫు బంధువులు విడదీశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది.

నిజామాబాద్‌ ఆర్యసమాజ్‌‌లో పెళ్లిపీటలపై కూర్చున్న అమ్మాయిని.. ఆమె తరపు బంధువులు అందరిముందే బలవంతంగా ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లారు. కాసేపటిలో వరుడు ఆమె మెడలో తాళి కట్టాల్సి ఉండగా.. జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్య, రేంజల్‌ మండలానికి చెందిన ప్రాణదీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. వీళ్ల పెళ్లిని పెద్దలు అడ్డుకుంటున్నారు. దీంతో.. ప్రేమికులు ఓ నిర్ణయానికి వచ్చారు. పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకోవాలనుకున్న సౌజన్య, ప్రాణదీప్ ‌.. నిజామాబాద్‌ ఆర్యసమాజ్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ముహూర్తం చూసి ఇవాళ పెళ్లి చేసుకునేందుకు ఆర్యసమాజ్‌ చేరుకున్నారు.