ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత..భారతీయులకి కలిసోచ్చేనా..?     2018-04-25   03:01:07  IST  Bhanu C

గత కొన్ని నెలలుగా హెచ్ -4 వర్క్ పర్మిట్ వీసాపై కొనసాగుతున్నసందిగ్ధతని రెండు రోజుల క్రితం ట్రంప్ సర్కార్ పూర్తిగా వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయం ఎంత సంచలనం కలిగించిందో వేరే చెప్పనవసరం లేదు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఎంతో మంది భారతీయ టెకీలపై ప్రభావం చూపనుంది..దాంతో మల్లగుల్లాలు పడుతూ ఆందోళనకి లోనవుతున్న భారతీయులకి తాజాగా ఓ వార్త కొంత ఊరటనిచ్చింది అనే చెప్పాలి..అదేంటంటే..

హెచ్‌1-బీ వీసా జీవిత భాగస్వాములకు ఉన్న హెచ్-4వీసా వర్క్‌పర్మిట్‌ను తొలగించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం పై ఈ వేసవిలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది..అయితే ఈ క్రమంలోనే కొందరు శాసనకర్తల నుంచి, ఐటీ ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవవుతోంది..పని అనుమతి రద్దు చేస్తే అధికంగా నష్టపోయేది భారతీయులే. అయితే హెచ్‌-4 వర్క్‌ పర్మిట్‌ రద్దు చెయ్యాలనే నిర్ణయాన్ని చాలా మంది శాసనకర్తలు, ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సహా పలు ఐటీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.