పగిలిన పెదవులకే కాకుండా లిప్ బామ్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో...?    2018-06-30   22:59:20  IST  Lakshmi P

పెదవులు పగిలినప్పుడు లిప్ బామ్ రాస్తూ ఉంటాం. మనం ఎక్కడకు వెళ్లిన మన బ్యాగ్ లో లిప్ బామ్ తప్పనిసరిగా ఉంటుంది. లిప్ బామ్ అనేది పగిలిన పెదవులకే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

చేతులు పొడిగా మారినప్పుడు రాసుకోవటానికి లోషన్ అందుబాటులో లేకపోతే లిప్ బామ్ రాసుకోవచ్చు. లిప్ బామ్ రాయటం వలన చేతులు పొడిగా లేకుండా తేమగా ఉంటాయి.

పొడిగా మారిన గోళ్లపై రాస్తే గోళ్లకు తేమ,పోషణ అందుతాయి. దాంతో గోళ్లు కాంతివంతంగా,ఆరోగ్యంగా ఉంటాయి.

కంటి మేకప్ ని తొలగించే రిమూవర్ అందుబాటులో లేనప్పుడు లిప్ బామ్ ని ఉపయోగించి కంటి మేకప్ తొలగించవచ్చు. మింట్ వాసన వచ్చే లిప్ బామ్ ని వాడితే బాగుంటుంది. మార్కెట్ లో చాలా రకాల లిప్ బామ్స్ అందుబాటులో ఉన్నాయి.