నెయ్యి జుట్టు సంరక్షణలో ఎలా సహాయపడుతుందో తెలుసా?

మారిపోయిన జీవనశైలి,వాతావరణంలో మార్పులు,కాలుష్యం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంది. తల దువ్వుకుంటే గుప్పెడు జుట్టు రాలిపోతుంది. అలాగే చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా మార్కెట్ లో అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ మన ఇంటిలో అందుబాటులో ఉండే నెయ్యితో ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.

నెయ్యి జుట్టుకు మంచి కండిషనింగ్ గా పనిచేస్తుంది. రెండు స్పూన్ల నెయ్యిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి తలకు రాసి మర్దన చేసి 20 నిమిషాల తరవాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

వెంట్రుకల చివర్ల చిట్లే సమస్యకు కూడా నెయ్యి బాగా పనిచేస్తుంది. మూడు స్పూన్ల నెయ్యిని తీసుకోని జుట్టు చివర్ల రాసి 20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

పొడి జుట్టు,చుండ్రు,పొడి చర్మం వంటి సమస్యలతో బాధ పడేవారికి నెయ్యి ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు. నెయ్యిని గోరువెచ్చగా చేసి దానిలో బాదం నూనె కలిపి జుట్టు మొదళ్లలో రాసి అరగంట తర్వాత ఆ నూనె పోయేలా రోజ్ వాటర్ తో జుట్టును శుభ్రంగా కడగాలి. ఈ విధంగా పదిహేను రోజులకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.