How to Treat Scalp Pimples

మొటిమలు అనేవి శరీరం, తల మీద చర్మం మరియు శరీరం యొక్క అనేక బాగాలపై కనపడతాయి. ఈ సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనపడుతుంది.

జుట్టు మీద చనిపోయిన చర్మ కణాలు మరియు సిబం కలిసి తల మీద చర్మం మీద చర్మ రంద్రాలను మూసివేయటం వలన మొటిమలు ఏర్పడతాయి. ఈ మొటిమలకు హార్మోన్ల మార్పులు,అనారోగ్యకరమైన ఆహారం, అలెర్జీ, ఆర్ద్ర పరిస్థితులు, కాలుష్యం మరియు కొన్ని రసాయనాల కారణంగా ఏర్పడతాయి. అలాగే ఈ సమస్యకు ఒత్తిడి, అలసట మరియు నిస్పృహ కూడా కారణం అవుతాయి. ఈ సమస్యను వదిలించుకోవటానికి కొన్ని సహజ నివారణలు మరియు నయం చేసే ప్రక్రియను వేగవంతం చేయటానికి సాధారణ చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1. టీ ట్రీ ఆయిల్:

టీ ట్రీ ఆయిల్ మోటిమలు మరియు ఇతర చర్మ సమస్యలను సమర్థవంతముగా నివారిస్తుంది. ఈ నూనెలో ఏంటి సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన చర్మ రంద్రాలను డ్రై గా చేసి మొటిమలను తగ్గిస్తుంది.

* రెండు స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనెలో 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలపాలి. ఈ మిశ్రమంతో తలకు మసాజ్ చేసి రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

* మనం రెగ్యులర్ గా వాడే షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలిపి జుట్టు శుభ్రం చేయటానికి ఉపయోగించాలి. * కాటన్ బాల్ పై కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని వేసి ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజు ఈ విధంగా రెండు సార్లు చేయాలి.