10 రోజుల్లో జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగాలంటే సులభమైన ఇంటి చిట్కాలు  

మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని జుట్టు రాలే సమస్య వేధిస్తుంది. ఈ విధంగా జుట్టు రాలిపోవడం వలన బట్టతల వచ్చేస్తుంది చిన్నవయస్సులోనే. దాంతో మంచి ఉద్యోగం ఉన్నా పెళ్లి అవటం కూడా కష్టం అవుతుంది. ఈ జుట్టు రాలే సమస్యను నివారించటానికి ఇంటిలో సులభంగా పాటించే చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అతిమధురం వేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉండుట వలన జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. అతిమధురం వేర్లను పేస్ట్ చేసుకోవాలి. ఒకప్పులో పాలలో పావు స్పూన్ కుంకుమ పువ్వు కలిపి దానిలో ఒక స్పూన్ అతిమధురం వేర్ల పేస్ట్ కలపాలి. ఈ పేస్ట్ ని మాడుకు, జుట్టుకు పట్టించి రాత్రంతా ఆలా వదిలేసి మరుసటి ఉదయం తలస్నానము చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అతిమధురం వేర్లు చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి.


గుడ్డులో జుట్టు పెరుగుదలకు సహాయపడే సల్ఫర్, ఫాస్ఫరస్, సెలేనియం, అయోడిన్, జింక్, ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఒక బౌల్ లో గుడ్డు తెల్లసొనను తీసుకోని దానిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత ఘాడత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.