How to transfer money to any bank from PayTM

ఆన్ లైన్ లో అమౌంట్ ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి ట్రాన్స్ ఫర్ చేయాలంటే అదో పెద్ద పని. మొదటగా, అందరికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటి ఉండదు మన దేశంలో. మరో విషయం ఏమింటే, ట్రాన్స్ ఫర్ అవడానికి టైమ్ పడుతుంది. అలాగే ట్రాన్స్ ఫర్ చేయాల్సిన అకౌంట్ మనం యాడ్ చేసుకోవాలన్నా టైమ్ పడుతుంది.

ఇక అలాంటి ఆలస్యం ఉండదు. సెకన్లలో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉన్నా లేకున్నా చల్తా. PayTM బ్యాంకులకి మనీ ట్రాన్స్ ఫర్ ని సులభతరం చేసింది. కేవలం నిమిషాల్లో మీరు డబ్బులు మరో బ్యాంక్ ఖాతాకి ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. అయితే, ప్రతీ వంద రూపాయలకి 2 రూపాయలు కట్ చేసుకుంటుంది PayTM.

ఇక ట్రాన్స్ ఫర్ చేసే ప్రాసెస్ చాలా సింపుల్. మీ PayTM ఖాతా ఓపెన్ చేసి, Passbook లోకి వెళ్ళండి. అక్కడ Send Money to Bank అనే ఆప్షన్ కనబడుతుంది. అప్పటికే PayTM లో డబ్బులు ఉంటే ఫర్వాలేదు .. లేదంటే యాడ్ చేయండి. Transfer అనే ఆప్షన్ నొక్కి, మీరు డబ్బులు పంపాల్సిన ఖాతా వివరాలు టైప్ చేసి, send నొక్కడమే. అంతే, నిమిషాల్లో డబ్బులు అవతలి ఖాతాలో పడిపోతాయి.