How to reduce your Smartphone Addiction

* సినిమా చూడ్డానికి వెళ్ళి, నిమిషనిమిషానికి స్నేహితులకి అప్డేట్స్ పంపిస్తే థియేటర్లో సినిమా చూడ్డం ఎందుకు? ఏకాగ్రత ఉండదు. జూకి వెళ్ళారు, ఇంకేదైనా పిక్నిక్ కి వెళ్ళారు .. ఎంతసేపు ఆ అందాలని మీ ఫోన్ కెమెరాలో బంధించడానికే ప్రయత్నిస్తారు తప్ప, వాటిని అస్వాదించరు. ఎందుకంటే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇంపార్టెంట్ అయిపోయింది. అలా కాకుండా, మీరు ఆ ప్రదేశాన్ని వీడే చివర్లో ఫోటోలు తీసుకోని, తీరిక సమయాల్లో అప్లోడ్ చేసుకోండి.

* పిల్లలైతే బయట అడే ఆటలపై ఇష్టం పెంచుకోవాలి. గ్రౌండ్ లోకి సెల్ ఫోన్ తీసుకోకపోవడమే మంచిది. ఇక పిల్లలైనా, పెద్దలైనా మీ స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ యాప్స్ ఉంచుకోకండి. యాప్స్ సంఖ్య పెరిగినాకొద్దీ వృధా అయ్యే సమయం కూడా పెరిగిపోతుంది.