How to reduce your Smartphone Addiction

* అవసరం ఉన్నప్పుడే వైఫై ఆన్ చేసి పెట్టండి. మిగితా సమయాల్లో వైఫై ఆఫ్ చేయండి. ఇంటర్నెట్ అలానే ఆన్ లో పెడితే నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, అవి వస్తున్నకొద్ది మనసు స్మార్ట్ ఫోన్ వైపు వెళుతూ ఉంటుంది. ఆ తరువాత ఏముంది, గంటో, అరగంటో సమయం వృధా.

* స్నేహితులతో, చుట్టాలతో ఫోన్ లోనే మాట్లాడేందుకు ప్రయత్నించండి. చాటింగ్ తగ్గిస్తే మంచిది. ఎందుకంటే చాటింగ్ అవసరం లేని విషయాలెన్నో డిస్కస్ చేస్తారు. అనవసరంగా టైమ్ వేస్ట్. అదే ఫోన్ లో మాట్లాడితే, సూటిగా, ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాం.