How to reduce your Smartphone Addiction

ఓరోజు నోట్ చేయండి .. రోజుకి ఎంత సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో లేదా, రోజుకి ఎంతసేపు స్మార్ట్ ఫోన్ మీద సమయం వృధా చేస్తున్నారో! నాలుపూటల అరగంట నుంచి గంట లెక్కేసుకున్నా, రోజుకి ఎన్ని గంటలు స్మార్ట్ ఫోన్ మీద గడుపుతున్నారో ఆలోచించండి. అయితే, ఇది మినిమమ్ లెక్క. రోజంతా స్మార్ట్ ఫోన్ మీదే కూర్చునే జనాలు ఎంతమంది లేరు. అదో వ్యసనం అయిపోయింది చాలామందికి. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్ .. ఇంకా ఇలాంటి పదుల యాప్స్ మన సమయాన్ని తినేస్తున్నాయి. అరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నాయి .. మనిషి ఈ బనిసత్వం నుంచి ఎలా తప్పించుకోవాలి? క్రమక్రమంగా సెల్ ఫోన్ వాడకాన్ని ఎలా తగ్గించాలి?

* స్మార్ట్ ఫోన్ వ్యసనం తగ్గుముఖం పట్టాలంటే, సాధ్యమైనంతవరకు మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టులు పెట్టవద్దు. ఎందుకంటే ఒక్కసారి పోస్టు పెడితే, దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నిమిషానికి ఓసారి చూడాలి అనిపిస్తుంది. మన పోస్ట్ మీద ఎవరైనా కామెంట్ పెడితే దానికి రిప్లై ఇవ్వడం, మన రిప్లైకి తిరిగి వారు రిప్లై ఇవ్వటం .. మళ్ళీ దానికి మన సమాధానం .. ఇలానే గంటలు గడిచిపోతాయి. కాబట్టి, పోస్ట్ పెట్టాల్సినంత గొప్ప విషయం అయితే తప్ప, సోషల్ మీడియా పోస్టులు వద్దు. రోజుకో అరగంట మీ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కి కలిపి వాడుకుంటే చాలు.