ఇలా చేస్తే సెల్ ఫోన్ ఎలా వాడినా సమస్యలు రావు.  

టెక్నాలజీని నమ్ముకున్న ఈ లోకం..వాటిలోనే మునిగిపోతోంది.. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు వంటి పరికరాలు పెచ్చరిల్లిపోతున్నాయి.ప్రకృతి లో హాయిగా గడపవలసిన మనిషి. ఇప్పుడు సెల్ఫోన్స్ చుట్టూ తిరుగుతున్నాడు. నిద్రలేచినప్పటి నుంచీ పడుకునే వరకూ స్మార్ట్ ఫోన్స్ తో గడిపే వారి సంఖ్య చాలా అధికమే.నిద్రలేవగానే సెల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే…కనీ ఇక్కడే వైద్యులు ఒక హెచ్చరిక చేస్తున్నారు.

నిద్రలేవగానే ఇది వరకు దేవుడి ని చూసేవాళ్ళం ఇప్పుడు సెల్ ఫోన్ మొఖం చేస్తున్నాం ఇది కంటికి చాలా చేటు అంటున్నారు వైద్యులు.మెసేజ్ లు ,ఈ మెయిల్స్ చూడటం వలన సమయం తెలియదు..అసలు పని పూర్తికాక పని వత్తిడి పెరిగిపోతుంది.అనేక రకాలైన హుద్రోగా సమస్యలు వస్తుంటాయి.కంటి సమస్యలకి కొదవేలేదు అని అంటున్నారు. అందుకు వైద్యులు ఇచ్చే సలహాలు పాటిస్తే మీరు సెల్ ఫోన్స్ వాడినా ఎమి కాదు అంటున్నారు.

ఉదయం లేవగానే కొంచం వ్యాయామం చేయాలట,అలాగే మనసు ప్రశాంతం గా ఉండటానికి పచ్చని మొక్కల మధ్యకుర్చుంటే హాయిగా ఉండి శరీరం చురుకుకా ఉంటుంది.అంతేకాదు మీరు పనిచేస్తూనే మంచి సంగీతాన్ని వినడం వలన చాలా రిలీఫ్ ఉంటుంది అని చెప్తున్నారు వైద్యులు. నిద్ర లేవగానే వెంటనే కాళ్ళు చేతులు సాగదీసి స్ట్రెచింగ్‌ వ్యాయామాలు..చేస్తే శరీరం ఇంకా ఉత్సాహంగా మారుతుంది