How to prevent STDs and oral cancers in $ex life

$ex వలన వ్యాధులు అనగానే మనకు కేవలం ఏయిడ్స్ గుర్తుకువస్తుంది. ఈ జబ్బుకి వైద్యం సరిగా అందుబాటులో లేక మనుషులు ప్రాణాలు వదులుతుండటంతో బాగా ఫేమస్ అయిపోయింది కాని, $ex వలన సంక్రమించే వ్యాధి అది ఒక్కటే కాదు. ఇంకా చాలా ఉంటాయి. HPI, గొనొర్రియా, చ్లామీడియా, సిఫిల్లీస్, జెనిటల్ హెర్పీస్ .. ఇలా ఇంకెన్నో ఉంటాయి. ఈ సుఖవ్యాధుల వలన ప్రతీ ఏడాది వేలాదిమంది కేవలం తమ $ex లైఫ్ నే కాదు, ప్రాణాల్ని కూడా కోల్పోతున్నారు. వీటీలో ప్రాణాంతక రొగాలు ఉంటాయి, మనిషిని తల్లి/తండ్రి అవకుండా చేసే రోగాలు కూడా ఉంటాయి. కొన్ని చర్మ సంబంధిత సమస్యలను తీసుకొస్తాయి. జననాంగాలని తీవ్రంగా ఇబ్బందిపెడతాయి. కాబట్టీ $ex వ్యాధులు / సుఖ వ్యాధుల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదు, మీ $ex లైఫ్ ని, మీ భాగస్వామి జీవితాన్ని కూడా కాపాడుకోవాలి. అందుకోసం మేం చెప్పే జాగ్రత్తలు తీసుకోవాలి.

#1. టెస్టులు :

మొదటిది చాలా సింపుల్ పాయింట్ .. మంచి సెక్సాలాజిస్టుని సంప్రదించి టెస్టులు నిర్వహించుకోవాలి. టెస్టుల్లో చాలారకాలు ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే రక్త పరీక్ష .. దీని వలన సిఫీల్స్ లేదా హెచ్ఐవి ఉందో లేదో తెలిసిపోతుంది. మూత్ర పరీక్ష ద్వారా కూడా కొన్ని రకాల సుఖవ్యాధులు బయటపడతాయి. ఒకవేళ మీ జననాంగాల దగ్గర ఏవైనా గాయలు, పుండ్లు ఉన్నాయి అనుకోండి .. ఆ గాయం లేదా పుండు నుంచి ఫ్లూయిడ్స్ సేకరిస్తారు. వాటిని టెస్ట్ చేసే ఇంఫెక్షన్ ఎలాంటిదో చెబుతారు. సలైవా టెస్ట్ కూడా కొన్ని సందర్భాలలో చేస్తారు.

ఇలా HPI, గొనొర్రియా, చ్లామీడియా, సిఫిల్లీస్, జెనిటల్ హెర్పీస్ .. ఎలాంటి వ్యాధి యొక్క లక్షణాలు కనిపించినా, రిస్క్ లో ఉన్నా, అసలు ఎలాంటి అవకాశం లేకపోయినా, మీ భాగస్వామితో కూడే ముందు ఓసారి టెస్టులు చేయించుకోవడం మంచిది. అవతలివైపు అర్థం చేసుకునే వారే ఉంటే, వారిని కూడా టెస్టులు చేయించుకోమ్మని చెప్పడం ఇంకా మంచిది. ఇద్దరు ఆరోగ్యంగా ఉంటేనే ఆ శృంగార జీవితం సురక్షితం. ఇద్దరిలో ఎవరు అనారోగ్యంగా ఉన్నా, ఇద్దరికి ప్రమాదమే. ఈ టెస్టులు ఒకసారి చేసుకోని ఆపేయకూడదు .. వీలు చిక్కినప్పుడల్లా చేయించుకోవాలి.