How to open beer bottle without opener ?

వోడ్కా అయినా, విస్కీ అయినా, బాటిల్ మూత ఓపెన్ చేయడం మరీ అంత కష్టం కాదు. ఓ చిన్నిపాటి స్టికర్ ని తీసేస్తే, ఫస్ట్ క్లాస్ పిల్లాడు కూడా కష్టం లేకుండా తీసేస్తాడు. కాని బీర్ బాటిల్ మూత అలా కాదుగా. తీయడం కష్టం. ఓపెనర్ ఉంటే తప్ప సులభతరం కాదు. కొందరు ఓపెనర్స్ లేకున్నా తమ దంత బలంతో బీర్ బాటిల్ మూత అలవోకగా తీసేస్తారు కాని బ్యాచ్ లో అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. వాడు ప్రతి పార్టీకి అందుబాటులో ఉండడుగా. అదీకాక సీక్రెట్ గా బీర్ కొట్టాలనుకున్నప్పుడు కుర్రాళ్ళు బీర్ మూత తీయడానికి పడే తంటాలు మామూలుగా ఉండవు. అందుకే బీర్ బాటిల్ మూతను తీయగలిగే కొన్ని ట్రిక్స్ ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాం.

* ఒక బీర్ బాటిల్ తో మరో బీర్ బాటిల్ ని ఓపెన్ చేయొచ్చు తెలుసా ? రెండు బీర్ బాటిల్స్ ఒకే చేతిలో పట్టుకోండి. ఒక బీర్ బాటిల్ మూత కింద మరో బీర్ బాటిల్ మూత ఉండేలా పట్టుకోండి. కాస్త స్టడీగా, కొంచెం బలం ఉపయోగించి టేబుల్ మీద కింది బాటిల్ ని దింపండి. కింది బాటిల్ ఫోర్స్ తో పై బాటిల్ మూత వచ్చేస్తుంది.

* సింపుల్ ఒక రూపాయి కాయిన్ తో కూడా బీర్ మూత తెయోచ్చు. కాని ఇది కొంచెం కండబలం ఉన్నవారికే సాధ్యపడే విషయం. ఎందుకంటే మణికట్టులో బలం ఉంటే తప్ప మూత బయటకి రాదు.