జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా,తేమగా ఉంచే పదార్ధాలు    2018-05-04   00:47:23  IST  Lakshmi P

జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా,తేమగా ఉంటేనే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అయితే మనలో చాలా మంది దీని పట్ల పెద్దగా శ్రద్ద పెట్టరు. జుట్టు కుదుళ్ళు తేమగా ఉంటే దురద, చుండ్రు,పొడి జుట్టు వంటి సమస్యలు రావు. బ్యూటీ స్టోర్స్ లో దొరికే ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగా జుట్టు కుదుళ్ళు తేమగా ఉండేలా చేసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

ఆలివ్ నూనె జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ చేసి ఎక్కువసేపు తేమగా ఉండేలా చేస్తుంది. ఆలివ్ నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసి మసాజ్ చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.