ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్న తులసి టీని ఎలా తయారుచేయాలో తెలుసా?    2018-06-18   23:05:30  IST  Lakshmi P

తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసిని మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్నారు. తులసి ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజు ఉదయం ఒక కప్పు తులసి టీ త్రాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే తులసితో టీ ఎలా తయారుచేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు తులసి టీ ఎలా తయారుచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు

తులసి ఆకులు కొన్ని
అల్లం చిన్న ముక్క
వాము పావు టీ స్పూన్
జీలకర్ర పావు టీ స్పూన్
మిరియాలు పావు టీ స్పూన్
బెల్లం తగినంత

తయారి విధానం
ఒక గిన్నెలో నీటిని పోసి పైన చెప్పిన పదార్ధాలన్నీ వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడకట్టి వేడిగా ఉన్నప్పుడే త్రాగాలి. ప్రతి రోజు త్రాగటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.