How to make soft chapati at home in telugu

చపాతీలు మృదువుగా,మెత్తగా ఉంటే తినటానికి చాలా బాగుంటాయి. కానీ చాలా మందికి చపాతీలు గట్టిగా వస్తు ఉంటాయి. తినటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గోధుమపిండితో కొంచెం సన్నగా పలుచగా చేస్తే పుల్కా అని,కొద్దిగా లావుగా,మందంగా చేస్తే చపాతీ అని,పొరలు పొరలుగా చేసి కూర స్టఫింగ్ చేస్తే పరోటా అని అంటాం. చాలా మంది చపాతీలు మృదువుగా రావటం లేదని చేయటం మానేస్తు ఉంటారు. కానీ చపాతీలు మెత్తగా మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. ఈ చిట్కాలు కూడా చాలా సులువుగానే ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

చపాతీ మెత్తగా,అంచులు అన్ని సమానంగా వచ్చి బాగా కాలాలంటే పిండి కలిపే సమయంలో కొంచెం వేడిపాలను పోసి బాగా కలపాలి. చపాతీ పిండిలో 60 శాతం నీటిని,40 శాతం పాలను పోసి కలిపితే చపాతీలు చల్లారిన తర్వాత కూడా మెత్తగా,మృదువుగా ఉంటాయి.


పిండి కలిపాక గంట వరకు చపాతీ చేయకూడదు. గంట లోపు చపాతీ చేస్తే గట్టిగావస్తాయి.

చపాతీలు మెత్తగా రుచిగా రావాలంటే బాగా పండిన అరటిపండు ముక్కను వేసి బాగా కలిపి అరగంట తర్వాత చపాతీ చేసుకోవాలి.

చపాతీలు కాల్చే సమయంలో మంట మధ్యస్థంగా ఉండాలి. ఎక్కువ మంట పెట్టి కాల్చితే గట్టిగా వస్తాయి.

చపాతీలు కాల్చిన తరువాత హాట్ ప్యాక్ లో వెంటనే పెట్టకూడదు ఆలా పెడితే ఆవిరి వచ్చి చపాతీలు తడిగా అవుతాయి. అందుకే ఒక 10 నిమిషాల తరువాత హాట్ ప్యాక్ లో పెట్టాలి.

ఈ సారి చపాతీలు చేసేటప్పుడు ఈ చిట్కాలన్నీ పాటిస్తే ఎన్ని తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది.