వీర్యం ఎక్కువ పడాలంటే ఏం చేయాలి ?  

అంగస్తంభన లేమి, శీఘ్రస్కలనం .. వీటి తరువాత మగవారు సెక్స్ జీవితంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య వీర్యం తక్కువగా రావడం. బయటకి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాని ఇలాంటి సమస్యతో కూడా చాలామంది మగవారు ఇబ్బందిపడతారు. వీర్యం తక్కువగా, పల్చగా పడటం వీరి సమస్య. అసలు మగవారు ఎంత వీర్యాన్ని బయటకి వదలాలి ? ఎంత విడుదల చేస్తే అది మంచిది ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం అయితే సగటున 3.7 మిల్లిలిటర్ల వీర్యం బయటకి రావాలి. ఈ నంబర్ కి అటుఇటుగా వీర్యం పడుతున్న ఫర్వాలేదు మీరు నార్మల్ కండీషన్ లో ఉన్నట్టే. కాని 1.5 మిల్లి లీటర్ల కిందకి మీ వీర్యం పడిపోయింది అంటే మాత్రం మీరు ప్రమాదంలో ఉన్నట్లే. దీనర్థం మీ ఒంట్లో వీర్యం సరిగా ఉత్పత్తి కావట్లేదు. ఈ సమస్య ఈ వయసులో వస్తుందని చెప్పలేం .. ఇది ఎప్పుడైనా రావొచ్చు. విచిత్రంగా, 20- 40 ఏళ్ల మగవారికే ఈ సమస్య ఎక్కువ ఉంటోందని చెబుతున్నాయి పరిశోధనలు. ఎలాగని 40 లు దాటినవారికి ఈ సమస్య ఉండట్లేదు అని కాదు, కాని ఆ వయసులో వారికి వీర్యం ఎంత పడుతోంది అనేది పెద్ద సమస్య కాకపోవచ్చు, వారికి అంగం సరిగా స్తంభిస్తే చాలు. కాని 20-40 ఏళ్ల వయసులో ఉన్నవారికి మాత్రం వీర్యం యొక్క వాల్యూం అవసరం. కాబట్టి … ఈ సమస్య ఎందుకు వస్తుందో … దీనికి పరిష్కార మార్గాలేంటో ఓసారి చూడండి.