రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి     2018-06-11   02:31:48  IST  Lakshmi P

ఐరన్ సమృద్ధిగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, లివర్, పన్నీర్, కోడిగుడ్లు వంటి ఆహారాలను తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.

మన శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరగాలంటే ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి ఆకుపచ్చని కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, పల్లీలు, అరటిపండ్లు వంటి ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

క్యాల్షియం, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండే దానిమ్మను ప్రతి రోజు తీసుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. అంతేకాక శరీరానికి పోషణ కూడా లభిస్తుంది.