తెల్లని అందమైన గోళ్లు మీ సొంతం కావాలంటే....బెస్ట్ టిప్స్     2018-04-19   00:01:15  IST  Lakshmi P

నిస్తేజంగా మరియు కళావిహీనంగా మారిన గోళ్లు మృదువైన చేతులను అందవిహీనంగా మారుస్తాయి. గోళ్లు నిస్తేజంగా మారటానికి విపరీతంగా గోళ్ళ రంగులను వేయటం మరియు మురికి పట్టటం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఒక్కోసారి గోళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. ఆలా మారిన గోళ్లను తెల్లగా మార్చుకోవటానికి సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నిమ్మరసం ఒక బౌల్ లో రెండు నిమ్మకాయల రసాన్ని పిండి దానిలో గోళ్లు మునిగేలా 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి గోళ్లను మెరిసేలా చేస్తుంది.