కొబ్బరినూనెలో ఇది కలిపి పెదాలకు రాస్తే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి    2018-05-12   21:44:48  IST 

ప్రతి ఒక్కరు పెదవులు అందంగా,కాంతివంతంగా,గులాబీ రంగులో ఉండాలని కోరుకుంటారు. అయితే గులాబీ పెదవుల కోసం ఖరీదైన కాస్మొటిక్స్ వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం కలకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మన ఇంటిలో సులభముగా అందుబాటులో ఉండే పదార్ధాలతో నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. దీనికి కేవలం మూడు పదార్ధాలు అవసరం అవుతాయి.

మొదటిది దాల్చిన చెక్క పొడి

దాల్చినచెక్క పొడి నలుపును తొలగించటంలో సహాయపడుతుంది. ఈ పొడిని వాడటం వలన ఎటువంటి చికాకు ఉండదు. ఈ పొడిలో విటమిన్స్,మినరల్స్,యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన పెదాల నలుపును తగ్గించటంలో సహాయాపడుతుంది.

రెండోవది బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన పెదాల నలుపును తగ్గించటంలో సహాయాపడుతుంది.