How to Get Rid of Stretch Marks Fast

స్ట్రెచ్ మార్కులు ఎక్కువగా పొత్తికడుపు ప్రాంతంలో వస్తాయి. అలాగే చేతుల పై బాగం, ఛాతీ, లోపలి తొడలు ,హిప్స్ వంటి ప్రాంతాల్లో కూడా వస్తాయి. అయితే వీటిని సహజసిద్దంగా తొలగించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.

1. గుడ్డు తెల్లసొన మరియు ఆలివ్ నూనె


స్ట్రెచ్ మార్కులను తగ్గించటానికి గుడ్డు తెల్లసొన మరియు ఆలివ్ నూనెతో ఒక ఇంటి నివారణ ఉంది. గుడ్డు తెల్లసొనలో ఉండే వివిధ రకాల ప్రోటీన్స్, కొల్లాజెన్ మరియు విటమిన్ ఎ చర్మానికి బాగా సహాయపడతాయి. ఆలివ్ నూనెలో సమృద్దిగా ఉండే విటమిన్ E, యాంటి ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యానికి మరియు చర్మాన్ని తేమగా ఉంచటానికి సహాయపడతాయి.

కావలసినవి
గుడ్డు తెల్లసొన
ఆలివ్ ఆయిల్

పద్దతి

మొదట స్ట్రెచ్ మార్కులు ఉన్న ప్రాంతంలో గుడ్డు తెల్లసొనను రాయాలి. ఇది బాగా ఆరాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ ని రాయాలి. ఇది స్ట్రెచ్ మార్కుల రంగును తగ్గించటానికి మరియు తేమగా ఉంచటానికి సహాయపడుతుంది.