How to get rid of lizards at home? Useful tips

6) దాని ఆహారం ఇంట్లో ఉంచొద్దు

బల్లికి మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంటుంది ? దానికి ఎలాగో ఓ ఇల్లు అక్కరలేదు కదా. మరి ఇంటికి ఎందుకు వస్తున్నట్లు? ఆహారం కోసమే కదా. మీ ఇంట్లో తనకి ఆహారం ఉందని అనిపిస్తేనే అది లోనికి వచ్చేది. మరి దాని అహారాన్నే ఇంట్లో లేకుండా చేస్తే ? మీరు తిన్న తిండి ఇంట్లో ఎక్కడ పడి ఉండకుండా శుభ్రం చేయండి, నీళ్ళు ఓ చోట ఆగి ఉంటే కూడా బల్లులు ఆకర్షితులవుతాయి. ఇలా ఎందుకో తెలుసా ? ఈ వాతవరణంలో పురుగులు వస్తాయని దానికి తెలుసు .. ఇక పురుగు కనిపిస్తే అది నాలుకతో ఎలా దాడిచేస్తుందో కూడా మనకు తెలుసు.

7) నెమలీక అంటే భయం :

వినడానికి విచిత్రంగానే ఉండొచ్చు కాని నెమలీక అంటే బల్లులకి భయమని అంటారు కొందరు. ఎందుకో, మన కంటికి అందంగా కనిపించే నెమలీక వాటిని మాత్రం భయపెడుతుందట. నిజమో అబద్ధమో, ప్రయత్నిస్తే తప్పేముంది .. ఓసారి నెమలీకలు వేలాడదీసి చూడండి. బల్లులు వస్తాయో, రావో, వచ్చినా నెమలీకను చూసి అక్కడే ధైర్యంగా ఉంటాయో ఉండవో. బల్లులు వచ్చేచోట తాడుతో పైగి కట్టి నెమలీకలు వేలాడదీసి, అవి గాలికి కదిలేలా కట్టండి చాలు.