How to get rid of lizards at home? Useful tips

2) సిట్రస్ వాసన పడదు

కేవలం బల్లులే కాదు, సిట్రస్ జాతి అంటే ఏ పురుగుకి పడదు. ఇవి సిట్రస్ ఫలాల్ని కాని, ఆకులని కాని, గ్రాస్ ని కాని, అసహ్యించుకుంటాయి. కాబట్టి లెమన్ గ్రాస్ సంపాదించండి. లెమన్ గ్రాస్ ని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి. ఆ వాసన వాటికి పడదు. లేదంటే లెమన్ గ్రాస్ ని ఆయిల్ లో ముంచి ఎక్కడైతే బల్లులు దర్శనమిస్తున్నాయో, అక్కడ కొన్ని చుక్కలు పోయండి. అలా కాదు అంటే లెమన్ గ్రాస్ ని అక్కడే వెలాడదీయండి.

3) కర్పూరం

ఇదో సింపుల్ చిట్కా. కర్పూరం మన ఇంట్లో కామన్ గానే ఉంటుందిగా. లేకపోయినా దొరకపట్టడం ఏమంత కష్టం లేండి. ఈ కర్పూరం వాసన మనుషులకి ఇష్టం కాని బల్లులకి ఇష్టం లేదు. అవి వాటికి ఎలర్జీని కలిగించనట్టు ఫీల్ అవుతాయట. కర్పూరానికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయట. ఇంకేం, కర్పూరం బిల్లలు తీసుకోని బల్లులు వచ్చే చోటు దగ్గరే కాదు, ఇంట్లో అక్కడక్కడ పెట్టండి. దెబ్బకి బల్లి పారిపోవాలి.